August 2025 Holidays : విద్యార్థుల‌కు భారీ శుభ‌వార్త‌.. ఆగ‌స్టులో ప్రారంభం కానున్న సెల‌వుల వ‌ర్షం.. ఈ పండుగ‌కు మాత్రం..!!

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇక‌, సెలవులంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. మ‌రి ఆగ‌స్ట్ వ‌చ్చే సెల‌వులేంటి..!! అనుకుంటారా.. ఇక్క‌డ తెలుసుకుందాం.. ప్రారంభంలోనే.. రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, ఉన్నాయి. అవి ముగిసిన వెంట‌నే జన్మాష్టమి, ఓనం, గణేష్ చతుర్థి వంటి పెద్ద పండులున్నాయి. అంతేనా.. ఇందులో మ‌రిన్ని ఆదివారాలు, రెండో శ‌నివారం వంటి సెల‌వులు కూడా ల‌భిస్తాయి.



ఈ ఆగ‌స్టు సెల‌వులతో విద్యార్థులు వారి చదువుతో పాటు కుటుంబం, సంప్రదాయాలు & వివిధ వేడుకల్లో కూడా పాల్గొనడానికి అవ‌కాశం ఉంటుంది. దేనికైన మ‌ధ్యలో బ్రేక్ కావాలి క‌దా.. ఇక్క‌డ‌, విద్యార్థుల‌కు చ‌దువు నుంచి కొన్ని రోజులు పండుగలు, వేడుక‌లు, సెల‌వుల పేరుతో కొన్ని బ్రేక్‌లు ల‌భిస్తున్నాయి. ఇక‌, విద్యార్థులు సైతం హుషారుగా ఉండేలా పాఠశాలలు సెల‌వు ప్ర‌క‌టిస్తారు.




SSC Phase 13 Exam Nationwide Protest : ఎస్ఎస్‌సీ ఫేస్ 13 పరీక్షల్లో తీవ్ర గందరగోళం.. ద‌ర్యాప్తు, ప‌రిష్కారం కోసం విద్యార్థుల నిరసనలు, డిమాండ్లు..






తేదీలు.. సెల‌వులు..





ఆగ‌స్టు 9న ర‌క్షాబంధ‌న్ (ఉత్తర భారతదేశంలో గొప్ప వైభవంగా జరుపుకుంటారు)

ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం

ఆగ‌స్టు 3, 10, 17, 24, 31వ తేదీల్లో ఆదివారాలు

ఆగ‌స్టు 16న జ‌న్మాష్ట‌మి (కొన్ని జిల్లాల్లో సెల‌వులు)



ఇక‌, ఓనం, వినాయ‌క చ‌వితి నాడు స్థానిక నిర్ణ‌యాల‌ను బ‌ట్టి సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తారు. ఇక‌, చాలావ‌ర‌కు సెల‌వులు అన్ని పాఠ‌శాల‌ల్లోనూ ప్ర‌క‌టిస్తారు. కొన్ని సెల‌వుల‌ను మాత్ర‌మే ప‌లు జిల్లాల్లో స్థానిక నిర్ణ‌యంపై ఆధారప‌డి ఉంటాయి.



ఇందులో ఉన్న 7 లేదా 8 సెల‌వులు ఇప్ప‌టికే యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో సెల‌వులు ఉంటాయని స్పష్ట‌మైంది.



August 2nd Current Affairs in Telugu: ఆగస్టు 2వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..!



ఓనం & గణేష్ చతుర్థి..





ఓనం అనేది కేరళలో భారీగా, అంగ‌రంగ వైభ‌వంగ జ‌రుపుతారు. దీనిని, ఆగస్టు 26 నుండి 28వ తేదీ వరకు జ‌రుపుతారు కేర‌ళ ప్ర‌జ‌లు. ఇక‌, వినియ‌క చ‌వితి విష‌యానికొస్తే, యావ‌త్ దేశంలో ఈ పండుగ‌ను వైభ‌వంగ జ‌రుపుకుంటారు. ముఖ్యంగా, నార్త్‌లో.. అంటే, మ‌హారాష్ట్రలో, అంతేకాదు, గోవా, తెలంగాణ, ఆంధ్రలో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ ఈసారి, ఆగస్టు 27వ తేదీన వ‌స్తుంది. ఆరోజున ప్ర‌తీ పాఠ‌శాల‌కు సెల‌వు ఉంటుంది.



☛Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMFzKz

Post a Comment

Previous Post Next Post