ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్లయినా హైదరాబాద్‌తో ఏపీ ప్రజలది విడదీయలేని బంధం. పేదింటి తల్లిదండ్రులు కష్టనష్టాల కోర్చి తమ బిడ్డలకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్‌లో చేర్పిస్తుంటారు. మరికొందరు ఉపాధి కోసం రెండేళ్లు తెలంగాణ ప్రాంతంలో ఉండడంతో వారి పిల్లలు అక్కడే చదువుకునే పరిస్థితి. అలా ఇంటర్ చదవడమే వారికి శాపంగా మారింది. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేదింటి బిడ్డలు సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది.
పన్నులు కట్టించుకుని.. ‘ఫీజు’ ఎగ్గొట్టి!
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణ ప్రాంత వాసులకు విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వారీగా మూడు రీజియన్ల ద్వారా లోకల్ కోటాలో 85 శాతం, నాన్‌లోకల్ (అన్ రిజర్వుడ్) కోటాలో 15 శాతం సీట్లు భర్తీ చేసేవారు. గత ఏడాదితో ఆ పదేళ్ల గడువు ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర రీజియన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలు నిర్వహించింది.
లోకల్ 85 శాతం, నాన్ లోకల్ (అన్ రిజర్వుడ్)లో 15 శాతం సీట్లు కూడా ఏపీ విద్యార్థులకు దక్కేలా జీవోలు తీసుకొచ్చింది. అయితే, రీజియన్లలో స్థానికత విషయంలో మెలికపెట్టింది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏపీలో చదివిన విద్యార్థులకే ప్రవేశాలలో ప్రాధాన్యం కల్పించింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో చదువుకున్న విద్యార్థులను ఏపీలో నాన్‌లోకల్‌గా మార్చేసింది. వారి కుటుంబాలు ఏపీలోనే ఉంటూ, పన్నులు కూడా కడుతున్నప్పటికీ విద్యార్థి ఇంటర్మీడియట్ చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఏపీలో సీటు ఇచ్చేది లేదని మూర్ఖత్వం ప్రదర్శించింది.
దీనిపై విమర్శలు రావడంతో ‘‘విద్యార్థి రెండేళ్లు ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదవినా వారి తల్లిదండ్రులు పదేళ్లు వరుసగా ఏపీలో ఉంటున్నట్టు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే’’, నాన్ లోకల్ కోటా (అన్ రిజర్వుడ్) 15 శాతం సీట్లలో వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించకుండా నిలువునా మోసం చేసింది.
ఇదీ చదవండి :పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్.. SSC కొత్త నిబంధనలు విడుదల!
రెండింటా నష్టపోయి...
ఓవైపు ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం జిత్తులు వేస్తోంది. మరోవైపు కొత్తకొత్త మెలికలతో రాష్ట్ర విద్యార్థులకు మొండిచేయి చూపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదే స్థానికత అంశాల్లో మార్పులు చేసింది. ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యా సంస్థల్లో సీట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. ఏపీకి చెందినవారు ఇంటర్ తెలంగాణలో చదివి.. అక్కడ ఈఏపీసెట్ రాసినప్పటికీ వారిని కన్వీనర్ కోటా సీట్ల నుంచి తప్పించింది. దీంతో ఎన్‌ఆర్‌ఐ కోటాలో రూ.లక్షలు పోసి చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
పోనీ, సొంత రాష్ట్రంలో హాయిగా చదువుకుందామని అనుకుంటే కూటమి ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టింది. ఏపీలో ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివినవారినే లోకల్ కోటా కింద పరిగణించింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒక్క సంవత్సరం బయట చదివినా వారిని స్థానికేతరులుగా మార్చేసింది. ఈఏపీసెట్‌లో ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రుల పదేళ్ల నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నాన్ లోకల్ (అన్ రిజర్వుడ్) కోటాలో సీట్లు కేటాయించింది. కానీ, ఫీజురీయింబర్స్‌మెంట్ మాత్రం ఎగ్గొట్టింది. ప్రస్తుతం విద్యార్థులు ఇంజనీరింగ్ సీటు అలాట్‌మెంట్ లెటర్లు పట్టుకుని కళాశాలలకు వెళ్తుంటే... ముందుగా ఫీజులు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు.
ముందుచూపులేని స్థానికత!
సరిగ్గా నిరుడు కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి హైదరాబాద్‌పై పదేళ్ల గడువు ముగిసింది. ఈ క్రమంలో విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవకాశాలపై స్థానికతను నిర్ధారించడంలో జాప్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడక మునుపే అంటే ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల గడువులో చివరి ఏడాది ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్‌లో చేరారు. వాళ్లు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ప్రభుత్వం ఆయా బ్యాచ్ విద్యార్థులకు కచ్చితంగా వెసులుబాటు ఇవ్వాల్సింది.
ఇవేమీ పట్టించుకోకుండా కూటమి సర్కారు ముందుకెళ్లడంతో ఏపీ విద్యార్థులు స్థానికత కోల్పోవాల్సి వచ్చింది. పోనీ, గత ఏడాదే ఏపీ విద్యార్థులు తెలంగాణలో చదువుకోవడంపై అవగాహన కల్పించిందా..? అంటే స్థానికతపై తాత్సారం చేసింది. ఈలోగా నిరుడు ఇంటర్ కోసం చాలామంది హైదరాబాద్ వెళ్లారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వీరు కూడా స్థానికేతరులుగా మారిపోతున్నారు. అసలు రాజ్యాంగ సవరణ లేకుండా ఏపీ స్థానికతను ఏ విధంగా మార్పు చేస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TM5znd