కొత్త పరిశ్రమల ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి!

పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది





తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు, MSME రంగాన్ని రక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని, గత ప్రభుత్వంలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళతామని వివరించారు.



చదవండి: Railway Jobs: ఆర్‌ఆర్‌సీ–సౌత్ వెస్ట్రన్ రైల్వేలో 904 అప్రెంటిస్ ఖాళీల భర్తీ.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!



తెలంగాణ పరిశ్రమల్లో రోల్ మోడల్‌గా





“తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారింది. గత ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. అయినప్పటికీ పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి” అని మంత్రి విమర్శించారు.



టి–వాలెట్‌లోకి డైరెక్ట్ నగదు బదిలీ సదుపాయం





టెక్నాలజీ వినియోగంలో మరో ముందడుగుగా, వినియోగదారులు ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా టి–వాలెట్ ఖాతాలోకి నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TM54PG

Post a Comment

Previous Post Next Post