ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా? ఇదిగో ప్రిపరేషన్ గైడ్!

ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి  తరచూ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఎంపిక ప్రక్రియలో అను¿¶ వం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులో అప్రెంటిస్‌గా శిక్షణ పొందితే.. బ్యాంకింగ్‌ కెరీర్‌కు అదనపు అర్హతగా దోహదపడుతుంది. ఇండియన్‌ బ్యాంక్‌ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ బ్యాంక్‌ ఉద్యోగార్థులకు చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. 




* మొత్తం అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 1500 

* తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–82, తెలంగాణ–42.

* శిక్షణ: 12 నెలలపాటు ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌. 







అర్హతలు

01.07.2025 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 01.04.2021 తర్వాత డిగ్రీ ఉత్తీర్ణులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయసు

01.07.2025 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ(నాన్‌ క్రీమీలేయర్‌) అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

స్టైపెండ్‌

ఎంపికై అప్రెంటిస్‌గా చేరిన అభ్యర్థులకు మెట్రో/అర్బన్‌ బ్రాంచ్‌ల్లో నెలకు రూ.15వేలు స్టైపెండ్‌ అందుతుంది. అదే విధంగా రూరల్‌/సెమీ అర్బన్‌ బ్రాంచ్‌ల్లో రూ.12వేలు స్టైపెండ్‌ లభిస్తుంది. వీరికి ఎలాంటి అలవెన్సులు లభించవు. కాని నెలకు ఒక క్యాజువల్‌ లీవ్‌తోపాటు బ్యాంక్‌  హాలిడేస్‌ అన్నీ పొందొచ్చు.

శిక్షణ–సర్టిఫికెట్‌

అప్రెంటిస్‌గా శిక్షణ సమయంలో అభ్యర్థుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఇందుకోసం అసెస్‌మెంట్‌ టెస్టులు నిర్వహిస్తారు. ఇవి థియరెటికల్, అదేవిధంగా ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ ప్రాక్టికల్‌గా ఉంటాయి. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిజిటల్‌గా సర్టిపికెట్‌ ఆఫ్‌ ప్రొఫిషియన్సీని అందిస్తారు.    

ఎంపిక ప్రక్రియ

ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిఛాయిస్‌ ప్రశ్నల విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీంతోపాటు లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్టు ఉంటుంది. బ్యాంక్‌ అవసరమనుకుంటే ఇంటర్వ్యూ కూడా  నిర్వహించే అవకాశముంది.

వంద మార్కులకు పరీక్ష




* ఎంపిక ప్రక్రియలో భాగంగా వంద మార్కులకు ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. దీన్ని ఆబ్జెక్టివ్‌ తరహాలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌ అప్టిట్యూడ్‌ 15 ప్రశ్నలు–15 మార్కులకు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులకు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 25 ప్రశ్నలు–25 మార్కులకు, జనరల్‌ అవేర్‌నెస్‌ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. 

* ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశ్న పత్రంలో ఇంగ్లిష్‌ విభాగం తప్ప మిగతా అన్ని విభాగాలను స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తారు. ఈ ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కును తగ్గిస్తారు. 

* రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను బ్యాంక్‌ నిర్ణయిస్తుంది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా రాష్ట్రాలు, యూటీల వారీగా మెరిట్‌ లిస్ట్‌ను రూపొందిస్తారు.  

* ఆన్‌లైన్‌ రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారినే ఎంపిక చేస్తారు. ఏ రాష్ట్రంలో అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.   







చదవండి: BTech అర్హ‌త‌తో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 41 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా!



ప్రిపరేషన్‌ ఇలా






* తొలుత సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించాలి. అనంతరం పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏ టాపిక్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి. 

* ఇంగ్లిష్‌లో ఎక్కువ స్కోర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్, గ్రామర్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వొక్యాబులరీ, సెంటెన్స్‌ కరెక్షన్, క్లోజ్‌ టెస్ట్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, మిస్‌స్పెల్ట్‌ వర్డ్స్‌ తదితరాలపై ప్రశ్నలు వస్తాయి. అదే విధంగా మెయిన్‌ పరీక్షలోని డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు సంబంధించి ఈ–మెయిల్స్, రిపోర్ట్, ప్రైసీ రైటింVŠ ను ప్రాక్టీస్‌ చేయాలి. 

* క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ విభాగంలో మంచి మార్కుల కోసం అర్థిమెటిక్, నంబర్‌ సిరీస్, సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ తదితరాలపై పట్టు సాధించాలి. 8, 9, 10వ తరగతి గణితం పాఠ్యపుస్తకాల ద్వారా ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సాధ్యమైనన్నీ గత ప్రశ్నలు, మోడల్‌ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. 

* రీజనింగ్‌ విభాగంలో రాణించేందుకు పజిల్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్, కోడింగ్‌–డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్, డెటా సఫీషయన్సీ అంశాలపై పట్టు సాధించాలి. 

* జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం కోసం బ్యాంకింగ్‌ రంగ తాజా పరిణామాలు, ఎకానమీ, బ్యాంకింగ్‌ టెర్మినాలజీ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్‌ అఫైర్స్‌ను తెలుసుకోవాలి. దీనికోసం ఏదైనా ప్రామాణిక దినపత్రికను అనుసరించాలి. 

* కంప్యూటర్‌ విభాగంలో మంచి స్కోర్‌ కోసం కంప్యూటర్‌ ఫండమెంటల్స్,   ఆపరేటింగ్‌ సిస్టమ్స్, లాంగ్వేజెస్, తాజా డవలప్‌మెంట్స్‌ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.







ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2025

వెబ్‌సైట్‌: www.indianbank.in







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TM9bw1

Post a Comment

Previous Post Next Post