డైరెక్టర్ల ఎన్నిక
వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: కాకతీయ
విశ్వవిద్యాలయ ఉద్యోగుల సహకార పరపతి సంఘం
ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. వర్సిటీ
పరిపాలన సమావేశం మందిరంలో నిర్వహించిన
జాబితా ప్రకటిస్తున్న ఎన్నికల అధికారి 1 428 కె.రవీంద్ర, సహాయ రిజిస్ట్రార్ దేవేందర్ రెడ్డి
ఈ ఎన్నికమంది సభ్యులకుగాను 349 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్ట ర్లను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కె. రవీంద్ర, సహాయ రిజిస్ట్రార్ దేవేందర్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్ల జాబితా ప్రకటించారు. ఎ.సతీష్బాబు, కేతిరి సతీష్, డా. కె.యాదగిరి, తాటి దామోదర్, నమిండ్ల కిరణ్ కు మార్, పెసరు మల్లికార్జున్, మహర్షి, పి. నర్మద, బి. కృష్ణ వేణిలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
...................................................................................
ఎంసీఏ పరీక్షలు ప్రారంభం
వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరి ధిలో మూడు కేంద్రాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లా రెడ్డి పరిశీలించారు. 293 మంది విద్యా హాజరైనట్లు తెలిపారు. ఆయన వెంట కంప్యూ టర్స్ విభాగం అధిపతి డా.డి. రమేష్ ఉన్నారు.
......................................................................................
12న ప్రిన్సిపాళ్ల సమావేశం
వరంగల్ విద్యావిభాగం: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ సహాయం, ప్రైవేటు ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లతో సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. అకాడమిక్, సిలబస్, పరీక్షలు తదితర అంశాలపై చర్చిం చనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
...................................................................................