12న ప్రిన్సిపాళ్ల సమావేశం
వరంగల్ విద్యావిభాగం: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ సహాయం, ప్రైవేటు ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లతో సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. అకాడమిక్, సిలబస్, పరీక్షలు తదితర అంశాలపై చర్చిం చనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
..........................................................................